మూడు యూనిట్ లతో సర్దార్ గబ్బర్ సింగ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 28 February 2016

మూడు యూనిట్ లతో సర్దార్ గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ - బాబీ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ని ఏప్రిల్ 8 న విడుదల చేస్తామని ముందు నుండి నిర్మాత శరత్ మరార్ చెప్పుకుంటు వస్తున్నాడు.

ప్రస్తుతానికి హైదరాబాద్ లో సర్దాగ్ర్ గబ్బర్ సింగ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు, దీని తర్వాత ఇంకా చాల షూటింగ్ పెండింగ్ ఉందని సమాచారం. ఏప్రిల్ 8 న ఎలా ఆయన విడుదల చెయ్యాలి అనే ఉద్దేశం తో దర్శకుడు బాబీ అదనంగా రెండు యూనిట్లను తాయారు చేసి షూటింగ్ జరుపుతున్నాడని సమాచారం.యూనిట్ కి 200 మంది చొప్పున మొత్తం 3 యూనిట్లు గబ్బర్ సింగ్ కోసం పని చేస్తున్నాయి .

 మార్చ్ 20 లోపు సినిమా కి గుమ్మడికాయ కొట్టేసే అవకాశం ఉంది. వచ్చే నెల 12 న ఆడియో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లో పవన్ సరసన తొలి సారిగా కాజల్ నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ అందిస్తున్నాడు. లక్ష్మి రాయి ఒక ప్రత్యెక గీతం లో నర్తించింది.
మూడు యూనిట్ లతో సర్దార్ గబ్బర్ సింగ్ Reviewed by Unknown on 22:21 Rating: 5 పవన్ కళ్యాణ్ - బాబీ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద ట్రేడ్ వ...

No comments: