నందమూరి బాలకృష్ణ కి తెలంగాణ సి ఏం గట్టి పంచ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే , హిందూపూర్ ఎం ఎల్ ఏ అయిన బాలయ్య హైదరాబాద్ లోని జుబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు.
దగ్గరలోనే బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది. తాజాగా బసవ తారకం కాన్సర్ ఆసుపత్రి కి పన్ను మినయించాలని బాలకృష్ణ ప్రత్యేకంగా కలిసారు. దాదాపు 2 కోట్ల పన్ను ను సి ఏం కే సి అర్ మాఫీ చేసాడు.ఇది జరిగి నెల కాకముందే కే సి అర్ బాలయ్య కి గట్టి షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే , బాలయ్య ఇల్లు , బసవ తారకం హాస్పిటల్ లో కొంత భాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
ఈ రెండు స్థలాలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున ఫ్లై ఓవర్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు వల్లే బాలకృష్ణ తన స్థలాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎంత స్థలం అనేది , జి ఎచ్ ఎం సి అధికారులు ఇంకా నిర్ణయించలేదు కాని ఇటివల ఒకసారి బాలయ్య నివాసాన్ని సందర్శించారు అని తెలుస్తుంది.మొత్తానికి కే సి అర్ బాలయ్య కి భారి పంచ్ ఇచ్చాడు. మరి ఈ విషయం మీద బాలయ్య ఏమంటాడో చూడాలి.


No comments: