రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతానికి తమ హీరో నుండి పెద్ద హిట్ ని ఆశిస్తున్నారు. బ్రూస్ లీ పరాజయం మెగా అభిమానులకు పెద్ద షాక్ అయితే , చరణ్ మెళ్లిగా తన ఉనికిని కోల్పోతున్నాడు అనేది నిజం. మగధీర హిట్ తర్వాత రామ్ చరణ్ ఏనాడూ సినిమాలలో వైవిధ్యం చూపించలేదు. దీని ఫలితమే , చరణ్ క్రేజ్ సినిమా సినిమాకి తగ్గుతు వస్తుంది. బ్రూస్ లీ సినిమా ఓపెనింగ్స్ తోనే చరణ్ స్టామిన హరించుకుపోతుంది అనే సంకేతాలు అభిమానులకు అందాయి.
ఈ విషయం మీద చరణ్ కూడా గట్టిగానే అలోచించి , తను ఒరువన్ లాంటి కథ ని చెయ్యడానికి పూనుకున్నాడు. ఇంత వరకు బానే ఉంది కాని ఇప్పుడు అభిమానుల్ని ఇంకో విషయం టెన్షన్ పెడుతుంది. ఇప్పటి వరకు , తెలుగు లో ఉన్న సీనియర్ హీరోలందరూ ఓవర్సీస్ లో మంచి రికార్డులను నెలకొల్పారు. మహేష్ , పవన్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ,ప్రభాస్ , నాని లాంటి వారు ఓవర్సీస్ మార్కెట్ ని ఒక ఆట ఆడుకుంటుంటే , చరణ్ మాత్రం ప్రతి సినిమాకి తగ్గుతు వచ్చాడు.
తను ఒరువన్ రీమేక్ అయిన ధ్రువ అయిన ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ చేస్తుందో లేదో అనే ఆలోచనలో ఉన్నారు అభిమానులు. మాములుగానే ఓవర్సీస్ జనాలకు చరణ్ సినిమాల మీద పెద్ద ఆసక్తి ఉండదు , రేపు చరణ్ కొత్త సినిమాలో ఓవర్సీస్ అభిమానులకు సరిపడా కంటెంట్ లేకపోతే ఎలా అనే ఆలోచనలో చరణ్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. మరి ఈసారి ఆయన చరణ్ మిలియన్ మార్క్ ని అందుకోవాలని ఆశిద్దాం.


No comments: