అందరికి షాక్ ఇస్తున్న మోహన్ లాల్ - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 28 February 2016

అందరికి షాక్ ఇస్తున్న మోహన్ లాల్

అందరికి షాక్ ఇస్తున్న మోహన్ లాల్


మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలియని దక్షిణ భారతీయుడు ఉండడు. తమిళ్ , మలయాళం సినిమాలలో నటించిన మోహన్ లాల్ , కొన్ని అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. మోహన్ లాల్ కి కేరళ , తమిళనాడు లో చాల పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కాని తెలుగు లో ఎప్పుడు సినిమాలు చెయ్యలేదు. బాలకృష్ణ నటించిన " ఘండివం " అనే సినిమా లోని ఒక పాటలో తలుక్కున మెరిసి వెళ్లారు.ఇన్నేళ్ళలో మోహన్ లాల్ తెలుగు సినిమాలు ఒప్పుకోలేదు

కాని ఈ ఏడాది ఏమైందో ఏంటో మరి , మోహన్ లాల వరుసగా 3 తెలుగు చిత్రాలకు సైన్ చేసాడు. ఒకటి చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం లో వస్తున్న సినిమా , ఇందులో మోహన్ లాల్ కథానాయకుడు. ఇంకోటి ఎన్టీఆర్ నటిస్తున్న జనత గ్యారేజ్ సినిమా. ఈ రెండు కాకుండా ఇంకో తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతానికి జనత గ్యారేజ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు మోహన్ లాల్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వకముందే మోహన్ లాల్ తెలుగు నేర్చుకున్నాడు.

 తెలుగు నేర్చుకున్నాక తొలి సారిగా జనత గ్యారేజ్ షూటింగ్ కి వచ్చిన మోహన్ లాల్ యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచాడట. తెలుగు డైలాగ్స్ ని తప్పు పోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం తో అందరు షాక్ కి గురి అయ్యారట. ఇంత తక్కువ సమయం లో తెలుగు ని అల ఎలా పట్టేసారండి బాబు అని యూనిట్ వాళ్ళంతా మోహన్ లాల్ చుట్టూ చేరిపోయారని సమాచారం. మరి ఈ సన్నివేశాలు చూసి రేపు ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.
అందరికి షాక్ ఇస్తున్న మోహన్ లాల్ Reviewed by Unknown on 06:55 Rating: 5 మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలియని దక్షిణ భారతీయుడు ఉండడు. తమిళ్ , మలయాళం సినిమాలలో నటించిన మోహన్ లాల్ , కొన్ని అనువాద చిత...

No comments: