బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కొత్త సినిమా చేయనున్నాడా ? ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం అయితే , ప్రభాస్ కొత్త సినిమా ఈ ఏడాది మొదలుపెట్టనున్నాడు. గత 3 ఏళ్ళుగా బాహుబలి సినిమా చేస్తున్న ప్రభాస్ , ప్రస్తుతానికి బాహుబలి 2 లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లేకపోతే నవంబర్ లో పూర్తి అయ్యే అవకాశం ఉంది.
బాహుబలి 2 షూటింగ్ అయిపోగానే ప్రభాస్ తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెడతడని తెలుస్తుంది. ఇప్పటికే , తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రన్ రాజ రన్ దర్శకుడు సుజిత్ తో ఉంటుందని ప్రభాస్ ప్రకటించాడు. సుజిత్ కూడా ఈ సినిమా కోసం గట్టిగానే స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఈ సినిమా ప్రభాస్ స్నేహితుల బ్యానర్ యు వి క్రియేషన్స్ లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే కెరీర్ లో చాల ఏళ్ళు బాహుబలి కి కేటాయించిన ప్రభాస్ , ఇక నుండి సినిమాల విషయం లో స్పీడ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఈ ఏడాది చివర్లో సినిమా మొదలుపెట్టి వచ్చే దసరా కి తన కొత్త సినిమా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. 2017 లో ప్రభాస్ బాహుబలి 2 తో పాటు ఇంకో సినిమా రానుంది అనమాట. అన్ని ప్రభాస్ అనుకున్నట్లు జరిగితే , ఖచ్చితంగా ఏడాది చివర్లో సినిమా ఖాయం.


No comments: