నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఈగ , అల మొదలయింది , పిల్ల జమిందార్ ,భలే భలే మగాడివోయ్ , కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లాంటి యూత్ అండ్ ఫ్యామిలి సినిమాలతో తన క్రేజ్ ని పెంచుకున్నాడు నాని. మద్యలో నాని , కొన్ని మాస్ చిత్రాలు ప్రయత్నించినప్పటికీ , పెద్దగా ఫలితం లేకుండా పోయింది. తెలియక చేసిన కొన్ని మాస్ సినిమాలు , మొహమాటానికి ఒప్పుకున్నా చెత్త స్టోరీస్ నాని కెరీర్ ని కొంత వరకు దెబ్బ తీసాయి అని చెప్పాలి.
ముఖ్యంగా ఈగ సినిమా తర్వాత నాని కి అస్సలు హిట్ అనేది లేకుండ అపోయింది. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత ఆచి తూచి ఆడుగులు వేస్తున్నాడు. ఇటివలే కొంత మంది నిర్మాతలు నాని తో మాస్ సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించారట. నాని మాత్రం మాస్ జోలికి వెళ్ళాను అని ఖర ఖండి గా చెప్పడం తో నిర్మాతలు షాక్ అయ్యారట. లేని ఇమేజ్ కోసం పాకులది ఉన్న ఇమేజ్ ని పోగొట్టుకోడం తనకు ఇష్టం లేదని , ఫ్యామిలి , కామెడీ సబ్జెక్టులు మాత్రమె చేస్తానని చెప్పుకోచ్చాడట. మొత్తానికి ఈ మధ్య వచ్చిన కుర్ర హీరోలు తెలుసుకోలేని సక్సెస్ మంత్రం ని నాని భలే పట్టేసాడు. అల్ ది బెస్ట్ నాని.


No comments: