తమిళ సూపర్ స్టార్ విజయ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, తమిళనాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న హీరో విజయ్.రాజకీయంగా , సినిమా పరంగా విజయ్ కి తమిళనాడు లో తిరుగు లేదని చెప్పాలి. ఈ మధ్య విడుదల అయిన విజయ్ సినిమా " పులి " భారి ఫ్లాప్ ని మూటగట్టుకుంది కాని విజయ్ మాత్రం మళ్ళి ఇంకో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.
రాజా రాణి లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో " తేరి " అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా లో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా టిజర్ 3 వారల ముందు యు ట్యూబ్ లో విడుదల అయ్యింది. విడుదల ఆయినా దగ్గర నుండి సౌత్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ టిజర్ అనుకోని రితి లో కోటి వ్యూస్ అంటే 10 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియా రికార్డు ని నెలకొల్పింది. సౌత్ ఇండియా ఏ ఇండస్ట్రీ కి కూడా దక్కని ఘనత తమిళ ఇండస్ట్రీ కి దక్కింది. ఏది ఏమైనా విజయ్ మరొక సారి తన క్రేజ్ చాటుకున్నాడు. ఏప్రిల్ లో విడుదల అవుతున్న ఈ సినిమా మీద సౌత్ ఇండియా వ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి.తేరి సినిమా మళ్ళి విజయ్ ఫాం లోకి వస్తాడని ఆశిద్దాం.


No comments: