రిస్క్ చేస్తున్న బన్నీ - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 21 February 2016

రిస్క్ చేస్తున్న బన్నీ

రిస్క్ చేస్తున్న బన్నీ


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని , అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా " సరైనోడు ". ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి కాని విడుదల తేది కొంత వరకు వివాదాస్పదం అయ్యేలా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు , అంటే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ , మహేష్ బాబు " బ్రహ్మోత్సవం " మధ్యలో వస్తుంది అనమాట. పవన్ , మహేష్ లాంటి టాప్ రేటెడ్ స్టార్ సినిమాల మధ్యలో అల్లు అర్జున్ సినిమా విడుదల చెయ్యడం సాహసమే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు కి టాక్ కి సంభందం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి , కాని అల్లు ర్జున్ అందుకు భిన్నం . బన్నీ కి ఓపెనింగ్స్ కంటే లాంగ్ రన్ లో ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. మరి తొలి రోజు టాక్ తేడ అయితే , లాంగ్ రన్ లో బన్నీ కి దెబ్బే అని చెప్పాలి. ఒక వేల సరైనోడు సినిమాకు మంచి టాక్ వచ్చిన సరే , మహేష్ లేదా పవన్ సినిమాల విడుదల వాళ్ళ ధియేటర్లు తగ్గించాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాల విషయాలలో బన్నీ రిస్క్ చేస్తున్నాడని చెప్పాలి. మరి ఈ రిస్క్ కి తగ్గ ఫలితం బన్నీ కి వస్తుందో లేదో చూద్దాం.
రిస్క్ చేస్తున్న బన్నీ Reviewed by Unknown on 19:37 Rating: 5 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని , అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే , స్టైలిష్ స్టార్ అల్లు ...

No comments: