తక్కువ కాలం లో బ్లాక్ బస్టర్ నిర్మాతా గా పేరు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్ . గబ్బర్ సింగ్ , బాద్ష సినిమా,అతో భారి హిట్ కొట్టిన బండ్ల గణేష్ టెంపర్ , నీ జతగా నేనుండాలి సినిమాల తర్వాత సినిమాలు నిర్మించడం ఆపేసాడు. మధ్యలో చిరు 150 మొదలు అయితే , కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిద్దాం అనుకున్నాడు కాని కుదరలేదు. ఈ మధ్యనే మలయాళం సూపర్ హిట్ సినిమా " టు కంట్రీస్ " రీమేక్ హక్కులను కూడా కొన్నాడు.
ఇక ఇప్పుడు లారెన్స్ రాఘవ హీరో గా అయన దర్శకత్వం లోనే ఓక్ కొత్త సినిమా ని నిర్మిస్తున్నాడు బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ .. ఈ చిత్రం తొందర్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. తెలుగు, తమిళ భాషల్లొ ఒకేసారి రూపొందబొయే ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని బ్రాండ్ల గణేష్ అన్నాడు. ఈ సినిమా కి నాగ భైరవ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ముని సిరీస్ తో హర్రర్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మరీనా లారెన్స్ ఈ సినిమాతో ఇంకో హిట్ కొడతాడని బండ్ల గణేష్ భావిస్తున్నాడు.ఏది ఏమైనా బండ్ల గ్యాప్ తీసుకున్నప్పటికీ , మంచి కాంబినేషన్ కొట్టేసాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.అల్ ది బెస్ట్ తో బండ్ల గణేష్.


No comments: