దర్శక ధీర రాజమౌళి నీ ఒక ఫోన్ కాల్ నిద్రపోనివ్వలేదట. ఇంతకి ఆ ఫోన్ కాల్ ఏంటో మీకు తెలుసా ? వివరాల్లోకి వెళితే , ఈ మధ్య రాజమౌళి కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ వచ్చిందట. ఆ వ్యక్తి రాజమౌళి కి ఫోన్ చేసి , పేరు చెప్పకుండా , మీకో సీక్రెట్ చెప్పాలి అన్నాడట. బాహుబలి 2 షూటింగ్ పార్ట్ అంత యు ట్యూబ్ లో పెట్టారండి అని చెప్పు ఫోన్ పెట్టేసాడట.
ఈ విషయం తెలిసేసరికి రాజమౌళి రాత్రి కి రాత్రి విషయం ఏంటని తన టీం నీ అప్రమత్తం చేసి కనుక్కున్నాడట. చాల సేపు ఎంక్వైరీ చేసాక తెలిసిన విషయం ఏంటంటే , రాజమౌళి కి చేసిన వ్యక్తి ఫేక్ న్యూస్ అందించాడు. ఆ కాల్ ఫేక్ అని తెలిపోడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారట. బాహుబలి మొదటి భాగం అప్పుడు లీక్ ఆయన విషయం మనకు తెలిసిందే , బాహుబలి 2 కి కూడా అలాగే జరిగిందేమో అని రాజమౌళి చాల బయపడిపొయడని సమాచారం. ఏది ఏమైనా రాజమౌళి కి మాత్రం ఈ ఫేక్ కాల్ పెద్ద ఝలక్ ఇచ్చిందని చెప్పాలి.ప్రస్తుతానికి బాహుబలి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. దీని తర్వాత కేరళ లో ఒక షెడ్యూల్ ఉంటుందని సమాచారం. బాహుబలి 2 నీ వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేసే అవకాశం ఉంది.


No comments: