9 వ సారి ఆ హీరో కి మ్యూజిక్ ఇస్తున్న తమన్ - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 21 February 2016

9 వ సారి ఆ హీరో కి మ్యూజిక్ ఇస్తున్న తమన్




టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికి 55 సినిమాల పై చిలుకు పని చేసాడు. తను చేసిన 55 సినిమాలలో 8 సినిమాలు ఒకే హీరో కి చెయ్యడం గమనార్హం. ఇంతకి ఆ హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారా , అతను ఇంకా ఎవరో కాదు మన మాస్ మహా రాజ రవి తేజ. తమన్ 2వ సినిమానే రవి తేజ కి మ్యూజిక్ అందించాడు , కిక్ సినిమా తో స్టార్ట్ అయిన వీరి కాంబినేషన్ పవర్ సినిమా వరకు కొనసాగింది. కిక్ , ఆంజనేయులు , నిప్పు , బలుపు , పవర్ ,వీర ,కిక్ 2 , మిరపకాయ్ సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఇప్పుడు ముచ్చటగా 9 వ సినిమా కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు తమన్. వివరాల్లోకి వెళితే , రవి తేజ చక్రి అనే కొత్త డైరెక్టర్ తో ఒక కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కి "రాబిన్ హుడ్ " అనే పేరు నీ కూడా ఖరారు చేసారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా కి కూడా తమన్ నీ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. ఏది ఏమైనా తమన్ - రవి తేజ కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అనే చెప్పాలి. రవి తేజ తో పవర్ లో పాట పాడించిన తమన్ , రాబిన్ హుడ్ లో కూడా ఎమన్నా పాట పాడిస్తాడెమో చూడాలి.
9 వ సారి ఆ హీరో కి మ్యూజిక్ ఇస్తున్న తమన్ Reviewed by Unknown on 19:08 Rating: 5 టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికి 55 సినిమాల పై చిలుకు పని చేసాడు. తను చేసిన 55 సినిమాలలో 8 సినిమాలు ఒకే హీరో కి చెయ్యడం గమనా...

No comments: