నేను రోబోని కాను : అమీ జాక్సన్ - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 27 February 2016

నేను రోబోని కాను : అమీ జాక్సన్

ఎవడు , ఐ సినిమాలతో తెలుగు తెర కి అంతో కొంత తెలిసిన బ్రిటిష్ మోడల్ " అమీ జాక్సన్ " . ఈ అమ్మాయి శంకర్ - రజినీకాంత్ తదుపరి చిత్రం రోబో 2.0 లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమీ జాక్సన్ పాత్ర కూడా రోబో నే అనే వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ వదంతులను కొట్టి పారేస్తూ , అమీ జాక్సన్ వివరణ ఇచ్చింది. తను ఈ సినిమాలో రోబో పాత్రలో పోషించాట్లేదని , హీరోయిన్ రోల్ ఏ చేస్తున్న అని చెప్పుకొచ్చింది అమీ జాక్సన్. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ తో నటిస్తా అని నేను కలలో కూడా అనుకోలేదని అమీ జాక్సన్ తెలిపింది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది , అమీ జాక్సన్ సంబంధించిన పోర్షన్ త్వరలో మొదలవుతుంది.

రోబో కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. చెన్నై లో ఈ సినిమా కోసం ఇప్పటికే భారి సెట్లు వేసారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారం తో తయారవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల అవ్వనుంది.
నేను రోబోని కాను : అమీ జాక్సన్ Reviewed by Unknown on 23:52 Rating: 5 ఎవడు , ఐ సినిమాలతో తెలుగు తెర కి అంతో కొంత తెలిసిన బ్రిటిష్ మోడల్ " అమీ జాక్సన్ " . ఈ అమ్మాయి శంకర్ - రజినీకాంత్ తదుపరి చిత్రం ...

No comments: