తమిళ దర్శకులు ఎప్పుడు తెలుగు హీరోలతో సినిమా చెయ్యాలని చాల ప్రయత్నిస్తుంటారు. శంకర్ , మణి రత్నం లాంటి అగ్ర దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమా చెయ్యడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆ తర్వాత లింగు స్వామి , హరి లాంటి తమిళ దర్శకులు రవి తేజ , మహేష్ బాబు , బాలయ్య బాబు తో సినిమా చెయ్యడానికి గట్టి ప్రయత్నాలే చేసారు.
లింగు స్వామి అయితే , మహేష్ - మాధవన్ తో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసాడు కాని మహేష్ ఆఖరి నిమిషం లో తప్పుకోడం విశేషం. ఇలా చెప్పుకుంటు పోతే తెలుగు హీరోలు తమిళ దర్శకులకు చాల సార్లు హ్యాండ్ ఇచ్చారు అనేది వాస్తవం. అయిన సరే లింగు స్వామి మాత్రం తెలుగు హీరో తో స్ట్రెయిట్ సినిమా చెయ్యాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు . ఈ సందర్భంగానే , ఒక మాస్ మసాలా కథ ని సిద్ధం చేసుకొని ఉన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ కథ ని ఎన్టీఆర్ , బన్నీ కి వినిపించాడనే టాక్ వినపడుతుంది.
లింగు స్వామి ఇప్పుడు కష్టకాలం లో ఉన్నాడు , కొన్ని సినిమాల మీద డబ్బులు పోగొట్టుకొని కష్టాల్లో ఉన్నట్లు సమాచారం. ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్టీఆర్ లింగు స్వామి తో సినిమా చెయ్యడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నాడని సమాచారం. లింగు స్వామి మాత్రం ఎన్టీఆర్ లేకపోతే బన్నీ తో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఆఖరికి లింగు స్వామి చేతికి చిక్కేది ఎవరో చూద్దాం.

No comments: