ఇప్పుడు ఆన్లైన్ లోనే దర్శకత్వం పాఠాలు - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 27 February 2016

ఇప్పుడు ఆన్లైన్ లోనే దర్శకత్వం పాఠాలు

మన తెలుగు సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సరి కొత్త ప్రయోగం చేయనున్నారు. దాదాపు 100 కి పైగా సినిమాలు డైరెక్ట్ చేసిన రాఘవేంద్ర రావు , సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి హీరోలని డైరెక్ట్ చేసాడు.అలాంటి దర్శకేంద్రుడు బయట పబ్లిక్ గా మాట్లాడే టైపు కాదు , ఎక్కువ శాతం మౌనంగా కనపడే రాఘవేంద్ర రావు ఈ మధ్య సౌందర్య లహరి అనే కార్యక్రమం తో కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు.

 ఈ టీవీ లో వచ్చిన ఈ కార్యక్రమం పెద్ద హిట్ అయ్యింది. ఇదే స్ఫూర్తి తో రాఘవేంద్ర రావు ఇప్పుడు ఆన్ లైన్ లో డైరెక్షన్ పాఠాలు చెప్పడానికి సిద్ధం అవుతున్నాడు. కె అర్ అర్ క్లాసు రూం పేరిట యు ట్యూబ్ లో కొన్ని వీడియోలు పొందుపరుస్తున్నారు. ఈ వీడియో లు చూసి దర్శకత్వం ఎలా చెయ్యాలి అనే విషయం మీద ఎంతో కొంత అవగాహన ఏర్పడుతుంది.

ఈ నాటి యువత కు సినిమా మీద మమకారం ఎక్కువ ఉందని , అందుకే ఇటువంటివి చెయ్యడం వల్ల , యువత కి ఎంతో కొంత సహాయ పడినట్లు ఉంటదని రాఘవేంద్ర రావు అభిప్రాయపడ్డారు. మరి మీరు కూడా కే అర్ అర్ క్లాసెస్ కి రెడీ నా ?
ఇప్పుడు ఆన్లైన్ లోనే దర్శకత్వం పాఠాలు Reviewed by Unknown on 00:31 Rating: 5 మన తెలుగు సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సరి కొత్త ప్రయోగం చేయనున్నారు. దాదాపు 100 కి పైగా సినిమాలు డైరెక్ట్ చేసిన రాఘవేంద్ర రావు , ...

No comments: