ఈ ఏప్రిల్ 8 న సూపర్ స్టార్ వర్సెస్ పవర్ స్టార్ తప్పేల లేదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అదేంటి మహేష్ బాబు సినిమా కూడా అదే రోజు వస్తుందా ? అని ఆలోచించకండి ఎందుకంటే , వచ్చేది తెలుగు సూపర్ స్టార్ సినిమా కాదండి , తమిళ సూపర్ స్టార్ సినిమా. వివరాల్లోకి వెళితే , విజయ్ నటించన " తేరి " సినిమా ఏప్రిల్ 8 న తమిళనాట పెద్ద ఎత్తున విడుదల అవుతుంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ నీ అదే రోజు విడుదల చెయ్యాలని విజయ్ భావిస్తున్నాడు కాని తెలుగు లో పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అదే రోజు విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం వల్ల చెన్నై లో పవన్ కళ్యాణ్ కి కొన్ని ధియేటర్లు తగ్గేల ఉంది , అదే విధంగా తెలుగు లో విజయ్ తేరి నీ విడుదల చేస్తే చాల నష్టపోవాల్సి వస్తుంది
. ఇక మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటక లో రెండు సినిమాలకు ధియేటర్లు దొరకడం కూడా కష్టమే , మరి ఇద్దరిట్లో ఎవరు తగ్గి విడుదలని వెనక్కి జరుపుతరో చూడాలి. విచిత్రంగా ఈ రెండు సినిమాలు పోలీస్ సినిమాలు అవ్వడం విశేషం. మరి ఏప్రిల్ 8 న సూపర్ స్టార్ వర్సెస్ పవర్ స్టార్ తప్పదా ?


No comments: