2013 నుండ ప్రభాస్ బాహుబలి లోనే నిమగ్నమయి ఉన్నాడు. బాహుబలి సాధించిన విజయం తో ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ యెఅదది చివర్లో అయిపోతుంది. ఈ సినిమా అయిపోగానే ప్రభాస్ ,సుజీత్ డైరెక్షన్ లో ఒక మాస్ మసాలా సినిమా చేస్తాడని చాల మంది చెప్పుకొస్తున్నారు.
ఈ సినిమా ని ప్రభాస్ స్నేహితులు యు వి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తారని సమాచారం. అయితే , ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇంకో సినిమాలో కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రభాస్ కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన " మిస్టర్ పర్ఫెక్ట్ " కి సీక్వెల్ ప్లానింగ్ లో ఉందని , ఈ సీక్వెల్ లైన్ దశరథ్ ప్రభాస్ కి వినిపించాడని భాగొట్ట. ప్రభాస్ ఆదేశం మేరకు దశరథ్ ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.
దశరథ్ కొత్త సినిమా " శౌర్య " ఈ నెల 4న విడుదల కి సిద్ధంగా ఉంది. మొత్తానికి ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ పూర్తి అవ్వకముందే సినిమాలు ఓకే చేస్తున్నాని అభిమానులు సంతోష పడుతున్నారు.


No comments: