సీనియర్ హీరోతో జత కట్టనున్న కాజల్ - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

సీనియర్ హీరోతో జత కట్టనున్న కాజల్


టాలీవుడ్ లో కాజల్ టాప్ హీరోయిన్ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ , మహేష్ , ఎన్టీఆర్ , చరణ్ , రవి తేజ , అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరి సరసన నటించింది. తమిళం లో కూడా పెద్ద స్టార్స్ సరసన చేసిన కాజల్ ఏనాడు సీనియర్ హీరోల జోలికి వెళ్ళలేదు

.తన వయస్సుకు తగ్గ హీరోలతోనే సినిమా చేస్తానని , సీనియర్ హీరోలతో చేసే ఉద్దేశం లేదని ఇంతకు ముందే కాజల్ చెప్పుకొచ్చింది. అయితే , తాజా సమాచారం ప్రకారం కాజల్ సీనియర్ హీరో అయిన వెంకీ తో జోడి కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.విక్టరీ వెంకటేష్ , ప్రస్తుతానికి బాబు బంగారం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

 ఈ సినిమా తర్వాత నేను శైలజ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కి కాజల్ అయితే బాగుంటుందని వెంకటేష్ సూచించినట్లు తెలుస్తుంది. కాజల్ ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వనప్పటికీ , చేసే అవకశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం.
సీనియర్ హీరోతో జత కట్టనున్న కాజల్ Reviewed by Unknown on 23:59 Rating: 5 టాలీవుడ్ లో కాజల్ టాప్ హీరోయిన్ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ , మహేష్ , ఎన్టీఆర్ , చరణ్ , రవి తేజ , అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే ...

No comments: