పూరి జగన్నాధ్ సినిమా అంటే పంచ్ డైలాగ్స్ , గున్నులు , మాఫియా , పోలీస్ ఇవన్ని గుర్తొస్తుంటాయి. అస్సలు పూరి సినిమా అంటేనే కొత్తదనం ఉంటుంది. పూరి తన సినిమా హీరో కి ఇచ్చే పొగరుని ఎవ్వరు అందుకోలేరు. సరి కొత్త పాత్రలని సృష్టించే పూరి సినిమాల్లో కామెడీ కి కూడా మంచి స్థానం ఉంటుంది. హీరో , విలన్ మధ్యలో కూడా కామెడీ పెట్టి నవ్వించగల ప్రబుద్దుడు మన పూరి.
పూరి గొప్పతనం ఏంటంటే , స్టార్ హీరోల నుండి చిన్న చితక హీరోల వరకు ఎక్క చేయకుండా సినిమా తీస్తాడు. చాల తక్కువ సమయం లో సినిమా పూర్తి చేసే పూరి కి ఈ మధ్య ఫుల్ టైం కామెడీ సినిమా చెయ్యాలనే ఆలోచన వచ్చిందట. కళ్యాణ్ రామ్ సినిమా అయ్యాక మహేష్ లేకపోతే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉంది కాని ఈ గ్యాప్ లో ఇంకో కామెడీ సినిమా చేయాలనేదే పూరి కోరిక.
మరి ఈ కామెడీ సినిమా కి హీరో ఎవరు అనుకుంటున్నారు ? మన అల్లరి నరేష్. అల్లరి నరేష్ అయితేనే తన కథ కి న్యాయం చెయ్యగలడు అని ఫీల్ అయిన పూరి , నరేష్ ని కలిసి లైన్ కూడా వినిపించాడట. ఈ ప్రాజెక్ట్ విషయం గురించి పూరి బయటకు చెప్పక పోయన అండర్ గ్రౌండ్ లో మాత్రం వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.


No comments: