ఎన్టీఆర్ లాగానే నాకు కావాలి అంటున్న చరణ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

ఎన్టీఆర్ లాగానే నాకు కావాలి అంటున్న చరణ్

ఎన్టీఆర్ లాగానే నాకు కావాలి అంటున్న చరణ్


రామ్ చరణ్ ఇప్పత్రి వరకు మొత్తం మాస్ పాత్రలే చేసాడు. ఆరంజ్ ఒకటి క్లాసు గా చేసినప్పటికీ , అభిమానులకు రుచించలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక చరణ్ ప్రయోగాలూ చెయ్యడమే మానేసాడు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాలు వెతుక్కొని మరి చేసాడు , ఫలితంగా చరణ్ క్లాసు కి పూర్తిగా దూరం అయ్యాడు. సరిగ్గా ఇలాగె ఎన్టీఆర్ కూడా అదుర్స్ కి ముందు భంగపడ్డాడు.

అదుర్స్ , బృందావనం , ఉసరవల్లి , నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో ఎన్టీఆర్ క్లాసు కి బాగా చేరువ అయ్యాడు , ఏ రేంజ్ లో అంటే , మల్టీప్లెక్స్ లో ఎన్టీఆర్ సినిమాలు 50 రోజులు ఆడుతున్నాయి. ఈ ప్లానింగ్ ని గుర్తించిన రామ్ చరణ్ , సుకుమార్ తో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ స్టొరీ లైన్ విషయం మీదనే సుక్కు ఈ మధ్య యు ఎస్ ఏ వెళ్ళాడని సమాచారం.

 అయితే , చరణ్ సుకుమార్ కి ఫోన్ చేసి కథ ఎలా ఉండాలి అనే విషయం మీద కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఎన్టీఆర్ కి రాసినట్లు తనకి కూడా జీరో మాస్ ఎలెమెంట్స్ తో కథ కావాలని కోరాడట . తన ఇమేజ్ కి పూర్తిగా భిన్నంగా ఉండాలని కోరినట్లు సమాచారం . మరి సుకుమార్ చరణ్ కి ఎలాంటి కథ ని అందిస్తాడో చూద్దాం.
ఎన్టీఆర్ లాగానే నాకు కావాలి అంటున్న చరణ్ Reviewed by Unknown on 08:05 Rating: 5 రామ్ చరణ్ ఇప్పత్రి వరకు మొత్తం మాస్ పాత్రలే చేసాడు. ఆరంజ్ ఒకటి క్లాసు గా చేసినప్పటికీ , అభిమానులకు రుచించలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక ...

No comments: