టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి. దర్శకుడు ఎలాంటి వాడు ఆయన సరే కథ నచ్చితే ఓకే చెప్తాడు పవర్ స్టార్. కెరీర్ మొదలు నుండి ఎంతో మంది కొత్త దర్శకులను నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. దర్శకుల జయపజేయలను పక్కన పెట్టి సినిమాలు ఒప్పుకునే పవర్ స్టార్ ఇక నుండి ఫ్లాప్ దర్శకులతోనే సాహసాలు చెయ్యడానికి డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ సమాచారం.
వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తను చెయ్యబోయే ప్రాజెక్ట్ ఏంటో ఇంత వరకు చెప్పనే లేదు .కాని ఫిలిం నగర్ వర్గాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఎస్ జ సూర్య లేకపోతే ,సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేసే అవకాశం ఉంది.
రెండిట్లో ఏ సినిమా ఓకే చేస్తాడో అనే టెన్షన్ తో అభిమానులు ఉండటం విశేషం. ఏది ఏమ్నైన ఫ్లాప్ దర్శకులకే సినిమా లు ఇవ్వడం పట్ల అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


No comments: