అదేంటి సినిమా ఇంకా విడుదల కాలేదు అప్పుడే ఫ్లాప్ అంటున్నారు అని ఆశ్చర్యపోకండి, ఒక సారి సెంటిమెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. మన తెలుగు సినిమాల్లో సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తారు. ఐరన్ లెగ్ అని గోల్డెన్ లెగ్ అని చాల పేర్లు కూడా పెడతారు. సరిగ్గా ఇలాంటి సెంటిమెంట్ ఒకటి, మహేష్ బాబు ఫ్యాన్స్ ని పీడిస్తుంది.
వివరాల్లోకి వెళితే , మహేష్ కెరీర్ ని ఒకసారి క్షున్నంగా పరిశీలిద్దాం.మహేష్ ఒక్క సారి హిట్ కొట్టిన దర్శకుడితో మళ్ళి చేస్తే ఖచ్చితంగా అది ఫ్లాప్ అవుతుంది. గుణశేఖర్ తో ఒక్కడు ఆ తర్వాత అర్జున్ , శ్రీను వైట్ల తో దూకుడు ఆ తర్వాత ఆగాడు , త్రివిక్రమ్ తో అతడు ఆ తర్వాత ఖలేజ , అదే విధంగా పోకిరి తర్వాత బుసినెస్స్మన్ కొంచెం లో కొంచెం పర్వాలేదు అనిపించింది.
ఈ లాజిక్ ప్రకారం చూస్తే , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తో ఫ్లాప్ ఇస్తాడా ? ఇటువంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీ లో గట్టిగానే వినిపిస్తాయి కాని ఎంత వరకు కొనసాగుతాయో తెలిదు. బ్రహ్మోత్సవం ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చెయ్యాలని ఆశిద్దాం.


No comments: