రాజశేఖర్ కి షాక్ ఇస్తున్న నిర్మాతలు - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

రాజశేఖర్ కి షాక్ ఇస్తున్న నిర్మాతలు

రాజశేఖర్ కి షాక్ ఇస్తున్న నిర్మాతలు


ఒకప్పటి స్టార్ హీరో , యంగ్రి యంగ్ మాన్ రాజశేఖర్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు రాజశేఖర్.లవర్ బాయ్ ,పోలీస్ , ఫ్యామిలి , ఇలా అన్ని రకాల పాత్రలు వేసి మెప్పించాడు రాజశేఖర్. వయస్సు తో పాటు రాజశేఖర్ కెరీర్ కూడా పడిపోయింది అని చెప్పాలి. కెరీర్ లో చిన్న చిన్న వివాదాలు కూడా రాజశేఖర్ ని కిందకి దించాయి.

ఇవన్ని పక్కన పెడితే , ప్రస్తుతనికిర్ అజశేఖర్ ని హీరో గా యాక్సెప్ట్ చేసే జనాలు కరువయ్యారు. గత 10 సినిమాలు లెక్కలు వేస్తే , రాజశేఖర్ ని జనాలు మర్చిపోయారని చెప్పొచ్చు. ఈ విషయం కొంచెం గట్టిగానే పట్టేసిన రాజశేఖర్ అర్జెంటు గా విలన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పటికే జగపతి బాబు , నవీన్ వడ్డే, సురేష్ లాంటి వారు విలన్లు అయిపోయారు.

తాజాగా రాజశేఖర్ కూడా ఈ లిస్టు లో చేరాడు. తేజ దర్శకత్వం లో వస్తున్న కొత్త సినిమా లో రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ విషయం తెలిసాక చాల మంది నిర్మాతలు రాజశేఖర్ ని విలన్ గా బుక్ చేసుకోడానికి క్యు లు కడుతున్నారట.ఒక్కో నిర్మాత ఇచ్చే ఆఫర్లు చూసి రాజశేఖర్ షాక్ అయ్యాడని సమాచారం. మొత్తానికి రాజ శేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగానే మొదలుపెట్టాడు.
రాజశేఖర్ కి షాక్ ఇస్తున్న నిర్మాతలు Reviewed by Unknown on 07:52 Rating: 5 ఒకప్పటి స్టార్ హీరో , యంగ్రి యంగ్ మాన్ రాజశేఖర్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు రాజశేఖర్.లవర్ బాయ్ ,పోలీస్ , ఫ్యామిలి...

No comments: