యంగ్రి యంగ్ మాన్ విశాల్ కి కోపం వచ్చింది. స్వహతగా చాల సహనం చూపించే విశాల్ ఇలా ఫైర్ అవ్వడం నిజంగా విచిత్రమే అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే , విశాల్ ఈరోజు తన ట్విట్టర్ లో ఆసక్తికరమైన ట్వీట్ వేసాడు. " ఈ మధ్య దర్శకులకు ఒప్పుకున్న సినిమాల మీద శ్రద్ధ లేదు , డైరెక్టర్ పని డైరెక్టర్ , హీరో పని హీరో చేసుకుంటే బాగుంటది " అని చెప్పాడు.
ఈ విషయం మీద కొంత మంది విలేకరులు విశాల్ ని ప్రశ్నించగా , గట్టిగానే స్పందించాడు. నేను నవంబర్ 24 నా పందెం కోడి సీక్వెల్ కి సైన్ చేశాను, ఫిబ్రవరి 2015 నుండి సినిమా మొదలు అన్నారు, అప్పటికి కనీసం స్క్రిప్ట్ కి సంబందందించిన పనులెవి మొదలు అవ్వలేదు. ఈ విషయం మీద లింగు స్వామి ని చాల సార్లు అడిగాను కాని సమాధానం లేదు . ఈరోజు సడన్ గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని మెసేజ్ చేసారు.
ప్రాజెక్ట్ లేదని ముందే చెప్తే అయిపోయేది గా , నేను ఈ సినిమా కోసం వేరే సినిమాలు వదులుకున్న" అని విశాల్ అన్నాడు. ఈ సినిమా కోసం నేను పెట్టిన ప్రతి రూపాయి తిరిగి తెచ్చుకుంటాను అని విశాల్ చెప్పాడు. ఈ విషయం మీద నిర్మాతల కౌన్సిల్ కి పిర్యాదు కూడా చేశాను అని చెప్పాడు విశాల్. ఏది ఏమైనా విశాల్ ఫైర్ చూసి అందరు షాక్ అయ్యారు అనేది నిజం.


No comments: