రజిని మీద ఫోకస్ పెట్టిన బండ్ల - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

రజిని మీద ఫోకస్ పెట్టిన బండ్ల

రజిని మీద ఫోకస్ పెట్టిన బండ్ల


బ్లాకు బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ మీద కన్ను వేసాడు. ఇప్పటికే , లారెన్స్ తో భారి బడ్జెట్ సినిమాని చేస్తున్న బండ్ల గణేష్ , రజినీకాంత్ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులకు కొండం అని ప్లాన్ చేస్తున్నాడట. రజినీకాంత్ కొత్త సినిమా " కబలి" . ఈ సినిమా షూటింగ్ అయిపోయి విడుదలకు సిద్దంగా ఉంది.

 ఈ సినిమా తెలుగు హక్కులను బండ్ల గణేష్ కొనుక్కోడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. 2010 లో రోబో తెలుగు హక్కులు అప్పట్లో 30 కోట్ల మేర రేట్ పెట్టారు. ఇది మరువక ముందే లింగా సినిమా ని 25 కోట్లకు కొన్నారు. రోబో పక్కన పెడితే రజిని తెలుగు లో కమర్షియల్ హిట్స్ తక్కువనే చెప్పాలి . కథ నాయకుడు సినిమా కూడా దక్షినాది భాషల్లో భారి రేట్ కి అమ్ముడు పోయి బయ్యర్ల కు నష్టాన్ని చవిచుసారు.

 కబలి తెలుగు హక్కుల రేట్ ప్రస్తుతానికి 25 కోట్ల వరకు చెప్తున్నారు. అంత అమౌంట్ పెట్టి డబ్బింగ్ సినిమా కొనడం సాహసమనే చెప్పాలి. మరి మన బండ్ల బాబు ఈ డీల్ ని ఇంతకి క్లోజ్ చేస్తాడో చూడాలి.
రజిని మీద ఫోకస్ పెట్టిన బండ్ల Reviewed by Unknown on 07:53 Rating: 5 బ్లాకు బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ మీద కన్ను వేసాడు. ఇప్పటికే , లారెన్స్ తో భారి బడ్జెట్ సినిమాని చేస్తున్న బండ్...

No comments: