చాల రోజుల తర్వాత సునీల్ మన మందుకు వస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో , జోష్ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వంలో వస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో కుటుంబ కథ చిత్రాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. కృష్ణాష్టమి ఆ కోవలోకే వస్తుంది.
ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ ని సాధించాయి. ఇటివలే సెన్సార్ పూర్తి చేసుకున్న కృష్ణాష్టమి టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం , కృష్ణాష్టమి సినిమా చాల బాగా వచ్చిందని , ఇంటర్వెల్ బాంగ్ తో పాటు , వన్ నేనొక్కడినే అని చేసే కామెడీ ట్రాక్ చాల బాగా వచ్చినదని తెలుస్తుంది, ఎప్పటి లాగానే సునీల్ ఇందులో డ్యాన్సులు ఇరగ తీసాడని చెప్తున్నారు. హీరోయిన్లు నిక్కి , డింపుల్ కూడా బాగా చేసారని సెన్సార్ సభ్యులు అభిప్రయపడ్డట్లు సమాచారం. తడాఖా , భీమవరం బుల్లోడు హిట్ల తర్వాత సునీల్ హ్యాట్రిక్ సాదిస్తాదని అభిమానులు ఆశిస్తున్నారు.


No comments: