బాహుబలి రికార్డుని కొట్టిన ఎన్టీఆర్ - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 17 February 2016

బాహుబలి రికార్డుని కొట్టిన ఎన్టీఆర్

బాహుబలి రికార్డుని కొట్టిన ఎన్టీఆర్


బాహుబలి సాధించిన రికార్డులు అంత ఇంతా కాదు. సౌత్ ఇండియా లో ఏ సినిమా అందుకోలేని రికార్డులను బాహుబలి అందుకుంది. బాహుబలి బిజినెస్ ప్రకారం కూడా సంచలనమే సృష్టించింది. వివరాల్లోకి వెళితే , బాహుబలి సినిమా ని కేరళ లో 3.25 కోట్ల కు అమ్ముడుపోయింది.

 కేరళ లో ఒక తెలుగు సినిమా ఇంత రేట్ పలకడం పెద్ద రికార్డు, కాని ఇప్పుడు ఈ రికార్డు ని ఎన్టీఆర్ తీరగారసాడు. ఎన్టీఆర్ - కొరటాల కొత్త సినిమా జనత గ్యారేజ్ కేరళ లో మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తున్నాడు. మోహన్ లాల్ తెలుగు సినిమా లో ఉండటం మూలాన కేరళ లో జనత గ్యారేజ్ డబ్బింగ్ హక్కులకు పెద్ద రేట్ పలుకుతుంది.

నిజానికి జనత గ్యారేజ్ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టుకోలేదు. షూటింగ్ మొదలవ్వకుండానే చాల మంది బయ్యర్లు జనత గ్యారేజ్ కేరళ హక్కులను కొనడానికి ముందుకు వచ్చారు. ఆఖరికి మైత్రి మూవీస్ వారు జనత గ్యారేజ్ సినిమా ని 4.5 కోట్ల కు అమ్మి కొత్త రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ కి కేరళ లో పెద్దగా మార్కెట్ లేకపోయినా మోహన్ లాల్ ఫాక్టర్ బాగా హెల్ప్ అయిందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే సౌత్ ఇండియా ని షాకే చేస్తున్నాడు.
బాహుబలి రికార్డుని కొట్టిన ఎన్టీఆర్ Reviewed by Unknown on 03:15 Rating: 5 బాహుబలి సాధించిన రికార్డులు అంత ఇంతా కాదు. సౌత్ ఇండియా లో ఏ సినిమా అందుకోలేని రికార్డులను బాహుబలి అందుకుంది. బాహుబలి బిజినెస్ ప్రకారం క...

No comments: