రాజమౌళి మీద ఎన్టీఆర్ అలిగాడా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

రాజమౌళి మీద ఎన్టీఆర్ అలిగాడా ?

రాజమౌళి మీద ఎన్టీఆర్ అలిగాడా ?


రాజమౌళి - ఎన్టీఆర్ మధ్యలో ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో ఇద్దరు తమ కెరీర్లను మొదలుపెట్టారు. సింహాద్రి యమ దొంగ తో ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ కి యెనలేని క్రేజ్ ఏర్పడింది.

యమదొంగ సినిమా తర్వాత మల్లి ఎన్టీఆర్ - రాజమౌళి కలిసి సినిమా చేస్తారని చాల వార్తలు వచ్చినప్పటికీ , అవన్నీ వదంతులే అని తేలిపోయాయి. ఒకానొక దశలో ఎన్టీఆర్ , రాజమౌళి తో సినిమా చెయ్యడానికి చాల ఆసక్తి చూపించాడు. పబ్లిక్ గా రాజమౌళి తో సినిమా చెయ్యాలని ఉందని , చేయట్లేదని చెప్పాడు కూడా. అయితే రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని చెప్తూనే ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌలు ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అందరు భావించారు కాని అనుకోకుండా రాజమౌళి మహేష్ బాబు పేరు ప్రస్తావించడం విశేషం.ఈ విషయం మీద ఎన్టీఆర్ అలిగినట్లు సమాచారం.

నాన్నకు ప్రేమతో సినిమా గురించి రాజమౌళి మాట్లాడకపోవడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది. మహేష్ బాబు కూడా రాజమౌళి తో సినిమా చెయ్యడానికి చాల ఆసక్తి ఉన్నాడు , దానికి తగ్గట్లు నిర్మాతలను కూడా సిద్ధం చేస్తున్నాటు భోగట్ట. ఏది ఏమైనా తనను పక్కకు పెట్టడం మీద ఎన్టీఆర్ గుర్రుగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. రాజమౌళి ఎన్టీఆర్ అలకలు ఎప్పుడు తీరుతాయో చూడాలి.
రాజమౌళి మీద ఎన్టీఆర్ అలిగాడా ? Reviewed by Unknown on 23:49 Rating: 5 రాజమౌళి - ఎన్టీఆర్ మధ్యలో ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో ఇద్దరు తమ కెరీర్లను మొదలుపెట్ట...

No comments: