రాజమౌళి ని వాడుతున్న సునీల్ - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 2 March 2016

రాజమౌళి ని వాడుతున్న సునీల్

గోల్డెన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సునీల్ ప్రస్తుతానికి కొత్త సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. కృష్ణాష్టమి ఫలితం సునీల్ కెరీర్ కి పెద్దగా ఉపయోగపడకపోయినా , సునీల్ మాత్రం రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు.కొత్త దర్శకుడు ఆకెళ్ళ వంశీ కృష్ణ సినిమా చేస్తున్న సునీల్ , ఈ సినిమా తర్వాత వీరు పొట్ల తో వీడు గోల్డ్ ఎహె అనే సినిమా కూడా సైన్ చేసాడు.

ప్రస్తుతానికి వంశీ కృష్ణ దర్శకత్వం లో చేస్తున్న సినిమా 50 % పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కి " జక్కన్న " అనే పేరు ని పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ రాజమౌళి ని ముద్దుగా పిలుచుకునే పేరు జక్కన్న. టాలీవుడ్ లో చాల మంది రాజమౌళి ని జక్కన్న అని పిలుస్తుంటారు.

ఇప్పుడు ఇదే పేరు ని సునీల్ తన సినిమా కి పెట్టుకుంటున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
రాజమౌళి ని వాడుతున్న సునీల్ Reviewed by Unknown on 05:20 Rating: 5 గోల్డెన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సునీల్ ప్రస్తుతానికి కొత్త సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. కృష్ణాష్టమి ఫలితం సునీల్ కెరీర్ కి పెద్...

No comments: