తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరో సారి ఎన్నికయ్యారు. ఈ సారి మారిన నిబంధనల ప్రకారం ఆయన టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా రూపుదిద్దేందుకు వీలుగా ఈ సారి కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. గండిపేటలో జరిగిన మహానాడులో అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఇనగాల పెద్దిరెడ్డి ప్రతినిధులకు ఎన్నిక షెడ్యూల్ ను వివరించారు. అద్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు వ్యవహారించారు. మహానాడు ప్రాంగణంలో సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. చంద్రబాబు తరుపున పార్టీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కళా వెంకట్రావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మొత్తం 30 సెట్ల నామినేషన్ పత్రాలను చంద్రబాబు తరుపున నాయకులు అందించారు. అయితే కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి ఒక్క చంద్రబాబు మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పార్టీ అధ్యక్ష పగ్గాలు చంద్రబాబు అందుకోవడం ఇది వరసగా తొమ్మిదో్ సారి కావడం విశేషం. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీని జాతీయ పార్టీ గా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదట కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశముంది.
Saturday, 30 May 2015
తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడిగా చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడిగా చంద్రబాబు.
Reviewed by Unknown
on
03:36
Rating: 5
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరో సారి ఎన్నికయ్యారు. ఈ సారి మారిన నిబంధనల ప్రకారం ఆయన టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్ష బ...
Reviewed by Unknown
on
03:36
Rating: 5
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరో సారి ఎన్నికయ్యారు. ఈ సారి మారిన నిబంధనల ప్రకారం ఆయన టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్ష బ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)


No comments: