మదర్ థెరిసా వారసురాలు సిస్టర్ నిర్మల కన్నుమూత - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 22 June 2015

మదర్ థెరిసా వారసురాలు సిస్టర్ నిర్మల కన్నుమూత

Mother Teresa's Successor Sister Nirmala Joshi Passes Away

మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆప్ చారిటీస్ బాధ్యతలు స్వీకరించిన సిస్టర్ నిర్మల, సదరు సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించారు. 1997 నుంచి 2009 దాకా మిషనరీస్ ఆఫ్ చారిటీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన ఆమెను 2009 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో సిస్టర్ నిర్మల కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
సిస్టర్ నిర్మల మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిస్వార్థంగా పేదల కోసం, అనాథల కోసం సేవలందించిన సిస్టర్ నిర్మలను కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.


Tags :: Mother Teresa's Successor Sister Nirmala Joshi Passes Away, Missionaries of Charity head Sister Nirmala who succeeded Mother Teresa passes away, Sister Nirmala Joshi, who headed Missionaries of Charity, Sister Nirmala, the successor of Mother Teresa passes away, 
మదర్ థెరిసా వారసురాలు సిస్టర్ నిర్మల కన్నుమూత Reviewed by Unknown on 23:32 Rating: 5 మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆప్ చారిట...

No comments: