పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త పవర్‌స్టార్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. గబ్బర్‌సింగ్2 అలియాస్ సర్దార్ సినిమా రెండవ షెడ్యూల్ ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని, పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడంటూ చిత్ర దర్శకుడు బాబీ ట్విట్టర్‌లో తెలియజేశాడు. పవర్ సినిమాకు గాను ఉత్తమ డెబ్యూ దర్శకుడు అవార్డు అందుకున్న సంతోషంలో ఉన్నాడు బాబీ. ఈ సందర్బంగా రవితేజాకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు.
అయితే పవన్ గుబురు గడ్డంతోనే షూటింగ్‌లో పాల్గొంటున్నాడా లేక క్లీన్ షేవ్‌తోనా?? అనేది మాత్రం తెలియదు. కాగా హీరోయిన్‌గా ఎంపిక చేసిన అనీషా అంబ్రోస్‌ని మార్చుతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇంకో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించనున్నాడు. ఆగష్టు 22 కల్లా ఫస్ట్ లుక్కో లేక టీజరో.. ట్రైలరో విడుదల చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవికి పుట్టిన రోజు బహుమతి ఇస్తారని ఆశిస్తున్నారు..

No comments: