‘ఉయ్యాల`జంపాల’ జంట రాజ్‌తరుణ్-అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో జూన్ 6న (సోమవారం సాయంత్రం) విడుదల కానుంది. శేఖర్‌చంద్ర సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను హైద్రాబాద్‌లోని శిల్పకళావేదిక పై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్-ఆర్‌డిజి ప్రొడక్షన్స్ ప్రై.లి. సంయుక్త సమర్పణలో.. ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి ‘మేం వయసుకొచ్చాం’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్(గోపి)-రూపేష్ డి.గోహిల్-జి.సునీత నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఆడియో విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీతం, వనమాలి-భాస్కరభట్ల రవికుమార్-కృష్ణచైతన్య-ప్రసన్నకుమార్ జెజవాడ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా శేఖర్‌చంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ‘సినిమా చూపిస్త మావ’ సినిమా ఒక్కటీ ఒకెత్తు’ అనేంత అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకి సమకూర్చాడు. మాస్ అప్పీల్ కలిగిన క్లాసికల్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు త్రినాధరావు నక్కిన ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు’ అన్నారు.
బ్రహ్మానందం, రావు రమేష్, తోటపల్లి మధు, కృష్ణభగవాన్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, మేల్కొటే, జయలక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోస్టర్స్ డిజైన్: విక్రమ్‌స్వామి, ఛీఫ్ ఆసోసియేట్ డైరెక్టర్: విశ్వనాధ్ అరిగెల, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సాయికృష్ణ, సంభాషణలు: ప్రసన్న జె.కుమార్, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్-దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-రూపేష్ డి.గోహిల్-బెక్కెం వేణుగోపాల్(గోపి)-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.
TAGS :: సినిమా చూపిస్త మావ ఆడియో రెడీ, సినిమా చూపిస్త మావ, cinema choopistha mava, cinema choopistha mava audio release details, raj tarun, avika gor, uyyala jampala, Taj Tarunin Cinema Choopistha Mava, Avika Gor in Cinema Choopistha Mava, Cinema Choopistha Mava Tolly News, Cinema Choopistha Mava Tollywood, Cinema Choopistha Mava, Cinema Choopistha Mava movie,


No comments: