ఆదివారంనాడు భారత – పాకిస్తాన్ దేశాలమధ్య నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ల స్థాయిలో జరగాల్సిన చర్చలపై అనుమానాలు తలెత్తాయి. రెండు దేశాలు ముందస్తు షరతులపై భీష్మించుకుని కూర్చున్నాయి. చర్చల అజెండా, కాశ్మీర్ విషయం చర్చించరాదని భారత్, అదే విషయం చర్చించాలని పాక్ పట్టుదలతో ఉండడంతో చర్చలకు ముప్పు ఏర్పడింది. కాశ్మీర్ లోని వేర్పాటు వాదనాయకుల పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సర్తాజ్ అజీజ్ ను కలుసుకునేందుకు అనుమతించారని పాక్ కోరుతోంది. భారత్ అందుకు సుముఖంగా లేదు. రష్యాలో భారత ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కలుసుకుని చర్చలకు అంగీకరించడంతో ఎన్ ఎస్ ఏ స్థాయి చర్చలు ప్రారంభం కావాలని నిర్ణయించారు. భారతదేశంలో టెర్రరిస్ట్ చర్యలకు పాక్ దేశీయులు, చొరబాటు దారులు తోడ్పడుతున్నారని భారత్ సాక్ష్యాధారాలు చూపేందుకు సిద్ధమవుతోంది. మరో పక్క హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు సర్తాజ్ అజీజ్ ను కలిసి చర్చించేందుకు అనుమతించాలని కోరుతోంది. ఫలితంగా చర్చల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది.

No comments: