ఎవ్వరినీ బాధపెట్టం అని నేను మాట ఇస్తున్నా - చంద్రబాబు - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 22 August 2015

ఎవ్వరినీ బాధపెట్టం అని నేను మాట ఇస్తున్నా - చంద్రబాబు


అటు రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు . భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసినా...వీలైనంత వరకు సమీకరణనకే రైతులను ఒప్పించాలని సూచించారు. అలాగే కేపిటల్ నిర్మాణంతో జరిగే మేలును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, అధికారులుకు సూచించారు .విజయవాడ క్యాంపు ఆఫీస్ లో పలు అంశాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఆర్డీఏపై నిర్వహించిన సమావేశానికి మంత్రి నారాయణ, గుంటూరు జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ ద్వారా సేకరించాల్సిన ౩వేల ఎకరాలు, నోటిఫికేషన్ వంటి అంశాలను గురించి అధికారులతో చర్చించారు సీఎం. నోటిపిషకేషన్ తర్వాత రైతులు, ప్రజలు, విపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను అడిగి తెలుసుకున్నారు. అలాగే అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణతో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు సమీకరణకే ఒప్పించేలా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది.
ఎవ్వరినీ బాధపెట్టం అని నేను మాట ఇస్తున్నా - చంద్రబాబు Reviewed by Unknown on 07:20 Rating: 5 అటు రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు . భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసినా...వీలైనంత వరకు సమీకరణ...

No comments: