ఎన్టీఆర్ కొత్త టైటిల్ అభి రామ్ ? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 8 September 2015

ఎన్టీఆర్ కొత్త టైటిల్ అభి రామ్ ?


ఎన్టీఆర్ ఇరవై ఐదవ సినిమా ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ డాన్స్ లే ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ గా చెబుతున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే ఈ సారి చాలాబాగా రాసాడు అని ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఆదరకోట్టేస్తాడు అని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యం లో ఈ సినిమా టైటిల్ విషయం లో వివిధరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సినిమాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలించారు. నిన్నటి వరకూ  సోషల్ మీడియాలో కూడా ఇదే టైటిల్ ఖరారు చేసారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదే ‘అభిరామ్’.ఇప్పటికిప్పుడు ఈ టైటిల్ తెరమీదకి రావడానికి కారణం ఈ సినిమా నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చెయ్యడమే. తాజాగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయడం, అలాగే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్ర పేరు కూడా అభిరామ్ కావడం వలన ఎన్.టి.ఆర్ 25వ సినిమాకి అభిరామ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే వారి దగ్గర ఉన్న ‘నాన్నకు ప్రేమతో’, ‘అభిరామ్’ అనే టైటిల్స్ లో ఒక దానిని ఫైనలైజ్ చేసి ఫైనల్ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. ఎన్టీఆర్ కొడుకు పేరు కూడా అభయ్ రాం  కావడం విశేషం 
ఎన్టీఆర్ కొత్త టైటిల్ అభి రామ్ ? Reviewed by Unknown on 04:08 Rating: 5 ఎన్టీఆర్ ఇరవై ఐదవ సినిమా ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ డాన్స్ లే ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ గా చెబుతున్నారు. సుకుమార్ స్...

No comments: