ప్రస్తుతం సినీ పరిశ్రమలో అందరూ రానా ట్రెండ్ ని ఫాలో అయ్యిపోతున్నారు. ఈ దగ్గుపాటి వారసుడు హీరోగా సినీ రంగానికి పరిచయం అయినా, కథ డిమాండ్ చేయటంతో భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి' లో నెగిటివ్ రోల్ వేసి అందర్నీ మెప్పించాడు. సినిమాలో పాత్ర ఏదైనా సరే ప్రదర్శన బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారని రానా నిరూపించారు. దాంతో స్టార్ హీరోలు సైతం పాత్ర నచ్చితే నెగిటివ్ రోల్ చేయటానికి కూడా వెనకడుగు వేయటం లేదు.
ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఒక నందమూరి హీరో ఫాలో అవుతున్నాడు. సినీ పరిశ్రమలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్న యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమాలో తారకరత్న ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇది పూర్తిగా నెగిటివ్ షెడ్ ఉన్న పాత్ర. తారకరత్న హీరోగా నిలదొక్కుకోవటానికి చాలా ప్రయత్నాలనే చేసాడు. కానీ అతని ప్రయత్నాలు అన్ని విఫలం అవటంతో రూట్ మర్చి విలన్ అవతారం ఎత్తుతున్నాడు. గతంలో అమరావతి సినిమాలో విలన్ గా నటించి మంచి మర్కులనే కొట్టాడు. ఈ నందమూరి కుర్రాడు విలన్ గా నైన సక్సెస్ సాదించాలని కోరుకుందాం.


No comments: