టాలీవుడ్ సినిమాలకు ఈ మధ్య కాలంలో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. మన టాలీవుడ్ బాలీవుడ్ వారికీ ధీటుగా సినిమాలను తీస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ధూమ్-3’లో కేవలం ఒక పాట కోసం 5 కోట్లు ఖర్చు పెడితే అది ఒక సంచలనం అయ్యింది. ఇప్పుడు అటువంటి సంచలనమే మన టాలీవుడ్ లో కూడా జరిగింది. అది ఏమిటంటే మహేష్ నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' సినిమాలో ఒక పాట కోసం శ్రీకాంత్ అడ్డాల అక్షరాల మూడు కోట్ల ఏబై లక్షలను ఖర్చు పెట్టించాడని ఫిల్మ్ నగర్ లో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది.
ఈ పాట సినిమాకి చాలా కీలకమైనదట. అందువల్ల శ్రీకాంత్ చెప్పినట్టు నిర్మాతలు కూడా వెనకడుగు వేయకుండా ఖర్చు పెట్టారట. ఈ పాట కోసం హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేకమైన భారీ సెట్ వేసి 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో పాటు ఈ సినిమాలో నటించిన ప్రధాన తారాగణంతో ఈ పాటను చిత్రీకరణ జరిపినట్టు సమాచారం. ఈ పాట వివాహ వేడుక సమయంలో వస్తుందట. ఈ పాట మొత్తం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. కాకపోతే ఈ ఒక్క పాటకు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న మంచి సినిమాను తీయవచ్చు.


No comments: