'నేను... శైలజ'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జనవరి 1న విడుదల - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 29 December 2015

'నేను... శైలజ'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జనవరి 1న విడుదల

nenu sailaja movie get u certificate release in january 1

పోస్టర్స్, ట్రైలర్, ఆడియో పరంగా ఆల్రెడీ 'నేను... శైలజ' అందరికీ దగ్గరైంది. గ్యారంటీ హిట్ అనే పాజిటివ్ వైబ్ నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యుల అభినందనలు కూడా లభించాయి. 'మంచి అనుభూతికి గురి చేసింది' అని సెన్సార్ బోర్డ్ సభ్యులు అభినందించారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రం అని క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చారు. జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది.

 ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్, సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది.

ఈ చిత్రవిశేషాలను 'స్రవంతి' రవికిశోర్ తెలియజేస్తూ - ''ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మంచి లవ్ స్టోరీ ఇది. ఇందులో రామ్ డీజేగా నటించాడు. తన పాత్రతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ మధ్యకాలంలో రామ్ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రం ఇది. రామ్ పాత్ర సాఫ్ట్ గా ఉంటూనే మాస్ కి కనెక్ట్ అవుతుంది. సత్యరాజ్ చేసిన తండ్రి పాత్ర అందరికీ నచ్చుతుంది. కిశోర్ తిరుమల చాలా క్లారిటీగా తెరకెక్కించాడు. సన్నివేశాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలకు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. 2015 సంవత్సరం మొదటి రోజున మా సంస్థ నుంచి వచ్చిన 'రఘువరన్ బీటెక్' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 2016 మొదటి రోజున విడుదల కానున్న స్ర్టయిట్ మూవీ 'నేను... శైలజ' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

సత్యరాజ్, నరేశ్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కష్ణచైతన్య, ప్రదీప్ రావత్, ధన్యా బాలకష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, డ్యాన్స్: శంకర్, ప్రేమ్ రక్షిత్, దినేష్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: కష్ణ చైతన్య, నిర్మాత: స్రవంతి రవికిశోర్, రచన-దర్శకత్వం: కిశోర్ తిరుమల.
'నేను... శైలజ'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జనవరి 1న విడుదల Reviewed by Unknown on 04:03 Rating: 5 పోస్టర్స్, ట్రైలర్, ఆడియో పరంగా ఆల్రెడీ 'నేను... శైలజ' అందరికీ దగ్గరైంది. గ్యారంటీ హిట్ అనే పాజిటివ్ వైబ్ నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్ర...

No comments: