ఆగష్టు 15 న వరుణ్ తేజ్ - క్రిష్ ల కంచె టీజర్ విడుదల - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 12 August 2015

ఆగష్టు 15 న వరుణ్ తేజ్ - క్రిష్ ల కంచె టీజర్ విడుదల

Varun Tej's Kanche Teaser on August 15th

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

ఈ చిత్రం మొదటి టీజర్ ను ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. ఈ విషయాన్నీ తెలుపుతూ, ఈ చిత్రం మొదటి పోస్టర్ ను హీరో వరుణ్ తేజ్ ఈ రోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు.  ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ , మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి.

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా  ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్  పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు .

భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు
ఆగష్టు 15 న వరుణ్ తేజ్ - క్రిష్ ల కంచె టీజర్ విడుదల Reviewed by Unknown on 09:19 Rating: 5 మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. బాల...

No comments: