'రీసౌండ్ ' అదిరింది - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 22 August 2015

'రీసౌండ్ ' అదిరింది


చరణ్ సినిమా అనగానే ఆయన నుంచి భారీ యాక్షన్ సీన్స్ ను అభిమానులు కోరుకుంటారు. దానిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 'ఫస్టు టీజర్' నిజంగానే కేక పుట్టించేలా వుందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ, కాస్త ముందుగానే వీటిని విడుదల చేశారు. రాత్రి రిలీజ్ చేసిన టీజర్ అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. '' వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా .. మొదలుపెట్టాక పూర్తయ్యేవరకూ రిక్వెస్టులు వినపడవు .. రియాక్షన్లు కనపడవు .. ఓన్లీ రీ సౌండ్'' అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతుందని చెప్పొచ్చు. చరణ్ చేతిపై వున్న 'బ్రూస్ లీ' టాటూ పైనే ఓపెన్ అయిన ఈ టీజర్లో .. బైక్ రైడింగ్ షాట్లు .. బోట్ చేజింగ్ షాట్లు అదుర్స్ అనిపించేలా వున్నాయి. శ్రీను వైట్ల మార్క్ కి కాస్త భిన్నంగా అనిపిస్తోన్న ఈ టీజర్ చూస్తుంటే, యూత్ కీ ..  మాస్ ఆడియన్స్ కి మరోసారి పండగ చేయడానికి చరణ్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 
'రీసౌండ్ ' అదిరింది Reviewed by Unknown on 07:39 Rating: 5 చరణ్ సినిమా అనగానే ఆయన నుంచి భారీ యాక్షన్ సీన్స్ ను అభిమానులు కోరుకుంటారు. దానిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 'ఫస్టు టీజర్' నిజం...

No comments: