పవన్ కల్యాణ్ అనే పేరే యూత్ ని ఒక మంత్రంలా ప్రభావితం చేస్తూ వుంటుంది .. ఉత్సాహంతో వాళ్లను ఊపేస్తుంటుంది. అందుకే ఆయన సినిమాలకి డిమాండ్ ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా రూపొందుతోన్న 'సర్దార్' సినిమా కూడా అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తోంది. ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు అప్పుడే మొదలయ్యాయనీ .. డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహాన్ని చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ కథ సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమైంది. ఆ తరువాత పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కావడానికి కొంత సమయం పట్టింది. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ విడుదల కావడం, పవన్ రెగ్యులర్ షూటింగులో పాల్గొనడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతూ ఉండటంతో .. డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. సినిమా సగం షూటింగ్ కూడా పూర్తికాకుండానే, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద సంఖ్యలో ముందుకువస్తుండటంతో .. పవన్ సినిమాకున్న పవర్ అలాంటిదనే టాక్ వినిపిస్తోంది.

No comments: