రెండేళ్లలో ఇరవై నాలుగు గంటలూ కరంట్ - కెసిఆర్ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 21 August 2015

రెండేళ్లలో ఇరవై నాలుగు గంటలూ కరంట్ - కెసిఆర్




తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో క్రమం తప్పకుండా ప్రతి గ్రామానికి త్రీఫేజ్‌ కరెంట్‌ను 24 గంటల పాటు అందిస్తానని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ వాటర్‌గ్రిడ్‌ ద్వారా నల్లా కనెక్షన్‌ ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు.  ప్రతి బస్తీ అద్దంలా మెరిసేలా చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వచ్చే ఆరు నెలల్లో ఎర్రవల్లిలో ఆడబిడ్డ బిందె పట్టుకుని బయటకు పోతే వెంటనే సర్పంచ్‌ , ఎంపీపీ అధ్యక్షుడు రాజీనామా చేయాలి. వాటర్‌గ్రిడ్‌లో మొదటి ప్రాధాన్యత గజ్వేల్‌కు ఉందని సిఎం అన్నారు . ఎర్రవల్లికి ప్రత్యేక కేటగిరి కింద డ్రిప్‌ను మంజూరు చేయిస్తాను. వచ్చే నాలుగేళ్లలో ఎర్రవల్లిని చూసేందుకు ప్రపంచం అంతా తరలి వచ్చేలా చేస్తానని కేసిఆర్  హమీ ఇచ్చారు.
రెండేళ్లలో ఇరవై నాలుగు గంటలూ కరంట్ - కెసిఆర్ Reviewed by Unknown on 22:41 Rating: 5 తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో క్రమం తప్పకుండా ప్రతి గ్రామానికి త్రీఫేజ్‌ కరెంట్‌ను 24 గంటల పాటు అందిస్తానని సీఎం కేసిఆర్ స్పష్టం చేశార...

No comments: