విజయవాడ లో బస్ భవన్ సిద్దం ! - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 21 August 2015

విజయవాడ లో బస్ భవన్ సిద్దం !



విజయవాడ ఏ పీ ఎస్ ఆర్ టీ సి బస్ భవన్ శరవేగం గా సిద్దం అవుతోంది, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరాత పరిణామాల్లో హైదరాబాద్ బస్ భవన్ పదేళ్ళ పాటు వినియోగించుకోవచ్చు అని విభజన చట్టం లో ఉంది అయినా సొంత రాష్ట్రం లో కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం కోసమే ఏ పీ ఆర్టీసీ వారు మొగ్గు చూపిస్తున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచీ విజయవాడ లో శాశ్వత కార్యాలయం ప్రారంభం కానుంది , దాని ద్వారా ఏపీ లో ఏర్పడుతున్న తొలి కేంద్రీకృత కార్యాలయం లో తొంబై ఐదు శాతం పనులు పూర్తి అయ్యాయి. ఆసియాలోనే  అతిపెద్ద బస్ స్టేషన్లలో ఒకటైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్  ఇక ఆర్టీసీ భవన్గా రూపుమారనుంది. ౩ దశాబ్దాల క్రితమే విజయవాడలో ఈ భారీ టెర్మినల్ను నిర్మించారు. ఈ భవనం మొదటి అంతస్తులో వేల చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. ఆ స్థలంలోనే ఇప్పుడు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 98లక్షల ఖర్చుతో  ప్రభుత్వ రంగ సంస్థ లేపాక్షి ఆధర్యంలో ఈ బస్ భవన్ ను ఆధునీకరించారు.
విజయవాడ లో బస్ భవన్ సిద్దం ! Reviewed by Unknown on 21:23 Rating: 5 విజయవాడ ఏ పీ ఎస్ ఆర్ టీ సి బస్ భవన్ శరవేగం గా సిద్దం అవుతోంది, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరాత పరిణామాల్లో హైదరాబాద్ బస్ భవన్ పదేళ్...

No comments: