కోనా వెంకట్ కొత్త అవతారం - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 26 August 2015

కోనా వెంకట్ కొత్త అవతారం


కోన వెంకట్.. తెలుగులో రచయితగా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి. పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చి, సినీ పరిశ్రమలో తనదైన బ్రాండ్‌ను సెట్‌ చేసిన కోన వెంకర్ నిర్మాతగానూ గీతాంజలి సినిమాతో మంచి హిట్ ఇచ్చారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం ఆయన వరుస హిట్లతో జోరుమీదున్న నిఖిల్‌ హీరోగా ‘శంకరాభరణం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఉదయ్ నందనవనమ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందుతోన్న ఈ సినిమాలో కోన వెంకట్ నిర్మాతగా, రచయితగా మాత్రమే కాక మరో కొత్త అవతారంతో దర్శనమివ్వనున్నారు. శంకరాభరణంలో ఓ పాటకు స్వయంగా కోన వెంకట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ తెలియజేస్తూ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో షేర్ చేసుకున్నారు. నిఖిల్, నందితలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రచయితగా, నిర్మాతగా మెప్పించిన కోన వెంకట్ కొరియోగ్రాఫర్‌గా ఎలా మెప్పిస్తారన్నది చూడాలి. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సరికొత్త కథతో శంకరాభరణం సినిమా రూపొందుతోంది.
కోనా వెంకట్ కొత్త అవతారం Reviewed by Unknown on 04:55 Rating: 5 కోన వెంకట్.. తెలుగులో రచయితగా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి. పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చి, సినీ పరిశ్రమలో తనద...

No comments: