ఒక మనిషి ఏదన్నా ఉద్యమం లేవదీస్తే ఖచ్చితంగా అది రాజకీయాలవైపు నడుస్తుంది, అదే విషయం కేజ్రీవాల్ దగ్గర నుంచీ అన్నా హజారే వరకూ కూడా నిరూపితం అయ్యింది. ప్రతీ ఉద్యమం వెనకా ఒక రాజకీయ బలం బలగం ఆలోచనా లేకపోయినా ఉద్యమం ఉదయించి మంచి ఉవ్వెత్తుగా లేస్తున్న సమయం లో ఎవరో ఒకరి ప్రోద్బలం మేరకు ఉద్యమ నాయకులు రాజకేయలలోకి వెళ్ళడం సర్వ సహజం. అయితే తాను మాత్రం రాజకీయాలలోకి రావాలి అని కోరుకోవడం లేదు అని తాజా పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ స్పష్టం చేస్తున్నాడు. గుజరాత్-లోని పటేల్ సామాజిక వర్గాన్ని ఈబీసీ జాబితాలో చేర్చాలని, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటూ 22 ఏళ్ళ హార్దిక్ పటేల్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. తానే కాకుండా ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రారంటూ ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పటేల్ నేతలు కొందరు ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పటేల్ ఈ విధంగా స్పందించారు.

No comments: