ఇద్దరినీ తప్పించమని, తెలుగు దేశం ఎంపీలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు :: - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 8 September 2015

ఇద్దరినీ తప్పించమని, తెలుగు దేశం ఎంపీలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ::


తెలుగుదేశం ఎంపీలు ఇద్దరూ ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షా పీఠం మీద కన్నేసిన విషయం తెలిసిందే, ఈ అంశం తెలుగుదేశం లో కూడా తీవ్రమైన చిచ్చు పెడుతూ ఉండడం తో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రమేష్ , గల్లా జయదేవ్ లు ఇందులో పోటా పోటీ గా ఉండగా ఇద్దరినీ తప్పించి మరొక వ్యక్తి ని ఇందుకోసం సెలెక్ట్ చెయ్యాలి అని కోరారు చంద్రబాబు. టీడీపీ ఎంపీల మధ్య వివాదంగా మారిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ రచ్చకు ముగింపు పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన స్పోర్ట్స్ రివ్యూలో.. ఈ అంశంపై చర్చించారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఎంపీలు.. సీఎం రమేష్, గల్లా జయదేవ్ లను ఏపీఓఏ నుంచి ఉపసంహరింపజేయాలని ప్రకటించారు. తర్వలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇరుపక్షాలను ఒప్పించాలని సమావేశంలో తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత ఆంద్ర ప్రదేశ్ ఒలంపిక్ సంఘం రెండుగా విడిపోయింది. ఏపీ ఒలంపిక్ సంఘానికి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఈ పదవి కోసం ఇద్దరు తెలుగు దేశం ఎంపీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. 
ఇద్దరినీ తప్పించమని, తెలుగు దేశం ఎంపీలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు :: Reviewed by Unknown on 04:02 Rating: 5 తెలుగుదేశం ఎంపీలు ఇద్దరూ ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షా పీఠం మీద కన్నేసిన విషయం తెలిసిందే, ఈ అంశం తెలుగుదేశం లో కూడా తీవ్రమైన చిచ్చు పెడుతూ...

No comments: