రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ సినిమా 'బాహుబలి' ఘన విజయాన్ని సాదించటమే కాకుండా ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను మా టివి మిగతా చానల్స్ తో పోటీ పడి మరీ 20 కోట్లు పెట్టి కొన్నది. దాంతో పెట్టిన పెట్టుబడి రావటానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయటం ప్రారంభం చేసేసింది. ఈ సినిమాని బుల్లి తెర ప్రేక్షకులకు దసరా కానుకగా అందిస్తుంది మా టివి.
ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే సమయంలో యాడ్స్ రూపంలో భారీ మొత్తాన్ని రాబట్టటానికి ప్లాన్ వేసింది. ఎందుకంటే బాహుబలి శాటిలైట్ హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టింది మా టివి. దాంతో మా టివి సినిమా టెలికాస్ట్ అయ్యే సమయంలో వచ్చే 10 సెకన్ల యాడ్ కి అక్షరాల రెండున్నర కోట్లను ఫిక్స్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే మా టివికి సినిమా అయ్యే లోపునే పెట్టిన పెట్టుబడి సగం పైనే వచ్చేస్తుంది. ఆ తరవాత మరో రెండు సార్లు బాహుబలి సినిమాని మా టివి వేస్తె సరిపోతుంది.


No comments: