బరువు తగ్గాలంటే...డైటింగ్ చాలాదా? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 3 October 2015

బరువు తగ్గాలంటే...డైటింగ్ చాలాదా?



విపరీతమైన డైటింగ్ చేస్తే చాలు...సన్నపడటం సులువు అని అనుకుంటారు చాలా మంది. ఇది కేవలం అపోహ మాత్రమే. పైగా దాని వలన ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే బరువు తగ్గాలని అనుకున్నప్పుడు ముందుగా జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవాలి. అవేమిటో ఒక లుక్ వేద్దాం.

* ఆకలిగా లేకపోయినా సరే....ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం మానకుండా తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ లేదా ఒక కప్పు పెరుగు ఏదైనా సరే తీసుకోవటం నియమంగా పెట్టుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా చురుకుగా ఉంచుతుంది.
* మన శరీరానికి పీచు చాలా అవసరం. అందుకే సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. దాని వలన మన శరీరానికి శక్తి అందటమే కాకుండా కొలస్ట్రాల్ ,మలబద్దకం తగ్గించటంలో సహాయపడుతుంది. భోజనం ముందు సలాడ్స్ తీసుకుంటే ఆహారం కూడా తక్కువగా తీసుకుంటాం.
* నడుస్తున్నా,పరుగెడుతున్నా....అదనంగా మరికొన్ని వర్క్ అవుట్స్ చేయటం తప్పనిసరి. అంతేకాక యోగాసనాలు, మెట్లెక్కి దిగటం వంటివి కూడా చేయాలి.
బరువు తగ్గాలంటే...డైటింగ్ చాలాదా? Reviewed by Unknown on 07:06 Rating: 5 విపరీతమైన డైటింగ్ చేస్తే చాలు...సన్నపడటం సులువు అని అనుకుంటారు చాలా మంది. ఇది కేవలం అపోహ మాత్రమే. పైగా దాని వలన ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు క...

No comments: