ఒకప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారటం, పళ్ళు పాడవటం వంటి సమస్యలు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. ప్రస్తుతం ఇటువంటి సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలోనూ కనపడుతున్నాయి. వీటికి కొన్ని పరిష్కారాలను చూద్దాం.
* కనీసం మూడు నిమిషాల పాటు పళ్ళు తోముకోవాలి. బ్రష్ ని నేరుగా చిగుళ్ళపై పెట్టి తోమితే రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చిగుళ్ళ మీద ఒత్తిడి లేకుండా మృదువుగా తోమాలి.
* చాలా మంది దంతాలు చక్కగా కన్పించటానికి తీగలు వేయించుంటారు. వాటిని వేయించుకొనేవారు ఆహారం తిన్న ప్రతి సారి పళ్ళను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే వాటిపై ఆహారం పేరుకుపోయి దంత క్షయం ఏర్పడుతుంది. ప్రతిసారి దంతాలు తోముకోవటం కష్టం అనుకుంటే నీళ్ళతో పుక్కిలించాలి. నీటి శాతం ఎక్కువగా ఉన్న పళ్ళను తరచూ తింటూ ఉండాలి.
* బ్రష్ చేసుకొనే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ ని మార్చాలి. నోటి పరిమాణానికి సరిపడా బ్రష్ ని ఎంపిక చేసుకోవాలి.


No comments: