'బ్రూస్ లీ' ఆడియో పంక్షన్ లో మెగా అభిమానులు విడిపోయరా? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 3 October 2015

'బ్రూస్ లీ' ఆడియో పంక్షన్ లో మెగా అభిమానులు విడిపోయరా?


నిన్న జరిగిన 'బ్రూస్ లీ' ఆడియో వేడుక చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రతి మెగా ఆడియో వేడుకల్లో విన్పించే ఒక మాట నిన్న జరిగిన వేడుకలో విన్పించలేదు. సాదారణంగా మెగా వేడుకల్లో పవర్ స్టార్ అంటూ నినాదాలు విన్పించటం సర్వ సాధారణమే. నిన్న మెగా అభిమానుల నోటి వెంట పవన్ పేరు అసలు రాలేదు. దీనికి మెగాస్టార్ వేసిన మెగా స్కెచ్ కారణం అనే వార్తలు విన్పిస్తున్నాయి.

ఇప్పటివరకు  మెగా కార్యక్రమాలకు సంబందించిన పాస్ లు మొత్తం మెగా అభిమానులందరికి చేరేవి. కానీ ఇప్పుడు పాస్ లను విడతీసి కేవలం చిరు అభిమానులకు మాత్రమే పంచారు. పవన్ అభిమానులకు ఎటువంటి పాస్ లు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే 'బ్రూస్ లీ' ఆడియో పంక్షన్ లో పవర్ స్టార్ మాట వినపడలేదు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ ని పిలిచినా రాలేదు. అలాగే మొన్న జరిగిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ 'కంచె' సినిమా ఆడియో వేడుకకు పిల్చినా కూడా పవన్ రాలేదు. అందుకే మెగా ప్యామిలీ కూడా పవన్ ఆడియో పంక్షన్స్ కి వెళ్ళకూడదని నిర్ణయం కూడా తీసుకున్నారని సమాచారం.
'బ్రూస్ లీ' ఆడియో పంక్షన్ లో మెగా అభిమానులు విడిపోయరా? Reviewed by Unknown on 21:12 Rating: 5 నిన్న జరిగిన 'బ్రూస్ లీ' ఆడియో వేడుక చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రతి మెగా ఆడియో వేడుకల్లో విన్పించే ఒక మాట నిన్న జరిగిన వేడుకలో విన్...

No comments: